ప: ఆశల వలయంలో లోకబాటలో
చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో [2]
ఏ క్షణము నీది కాదు
ఈ సమయం నీతో రాదు [2]
యేసు నిన్ను పిలచుచున్నాడు
తన యొద్దకు రమ్మని
యేసు నిన్ను పిలచుచున్నాడు [2]
ఆశల వలయంలో పాప బ్రతుకులో
చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో... [1]
1. కులం నాదీ మతం నాదనీ భావమెందుకు
బలం నాదీ ధనం ఉందనీ గర్వమెందుకు [2]
ప్రాణంవున్న నీ దేహము రేపు మట్టి బోమ్మరా
మట్టి బోమ్మ చివరి మజిలీ
ఎన్నటికైనా మట్టిలోకిరా [2]
స్నేహమా స్నేహమా స్నేహమా గమనించుమా
నేస్తమా నేస్తమా నేస్తమా అలోచించుమా [1]
ఆశల వలయంలో పాప బ్రతుకులో
చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో.. [1]
2. అందముందీ జ్ఞానముందనీ భావమెందుకు
దేవుడే లేడు నేనెే దేవున్ననీ గర్వమెందుకు [2]
అందమంతా చీకిపోవును ఎన్నటికైనా
నీ యౌవన అందమంతా
ఎప్పటికైనా మట్టిపాలురా [2]
స్నేహమా స్నేహమా స్నేహమా గమనించమా
నేస్తమా నేస్తమా నేస్తమా అలోచించుమా [1]
ఆశల వలయంలో పాప బ్రతుకులో
చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో.. [1]
3. పాపివైనా నీ కోసమే యేసు వచ్చేను
తన రక్తమంతయు ధారపోసేను నీ కోసమే [2]
ఆ రక్తములో కడగబడితే పరలోకమేరా
పరిశుద్ద సిలువ రక్తమును
నిర్లక్ష్యపరిచితే అగ్నిగుండమురా [2]
సోదరా సహోదరీ సోదరా గమనించుమా
సోదరా సహోదరీ సోదరా అలోచించుమా [1]
ఆశల వలయంలో పాప బ్రతుకులో
చిక్కిన ఓ మనిషి నీ గతి ఏమౌనో.. [1]
|ఆశల వలయంలో|
0 Comments