అనురాగ పూర్ణుడా Hosanna 2024 song
నీకేగా నా స్తుతిమాలిక
నీ కొరకే ఈ ఘనవేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరణానికైనా వెనుతిరుగలేదు
మన లేను నే నిన్ను చూడకా
మహా ఘనుడా నా యేసయ్య " నీకేగా "
1. సంతోష గానాల స్తోత్రసంపద
నీకే చెల్లింతును ఎల్లవేళల
అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా"2"
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవులేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా "2" (నీకేగా)
2. నీతో సమమైన బలమైన వారెవ్వరూ
వేరే జగమందు నే ఎందు వెతికినను
నీతిభాస్కరుడా నీ నీతికిరణం
ఈ లోకమంతా ఏలుచున్నదిగా"2"
నా మదిలోన మహారాజు నీవేనయ్య
ఇహపరమందు నన్నేలు తేజోమయ
నీ నామం కీర్తించి ఆరాధింతును"2" (నీకేగా)
3. నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం"2"
నా శ్వాస నిస్వాసయు నీవేనయ్యా
నా జీవిత ఆద్యంతం నీవేనయ్యా
నీ కొరకే నేనిలలో జీవింతును "2" (నీకేగా)
0 Comments