ప: స్థిరపరచువాడవు బలపరచువాడవు
పడిపోయిన చోటే నిలబట్టువాడవు
ఘనపరచువాడవు హెచ్చించువాడవు
మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ||2||
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు
నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ||2||
యేసయ్య యేసయ్య నీకే నీకే సాధ్యము ||2||
1. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి
నీ చేతిలోనే మా జీవమున్నది ||2||
మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి
మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి 2
||ఏమైనా చేయగలవు ||
2. నీ ఆజ్ఞ లేనిదే ఏదైన జరుగునా?
నీ కంచే దాటగ శత్రువుకు సాధ్యమా? ||2||
మా దేవా నీవే మాతొడుంటే అంతే చాలును
అపవాది తలచిన కీడులన్నీ, మేలైపోవును ||2||
||ఏమైనా చేయగలవు||

0 Comments