కో: వందనాలు వందనాలయ్యా...
శతకోటి స్తోత్రలయ్యా... [1]
పల్లవి:
యేసయ్య వందనాలయ్యా
నీ ప్రేమకు వందనాలయ్యా [2]
నన్ను రక్షించినందుకు పోషించినందుకు
కాపాడినందుకు వందనాలయ్యా [2]
వందనాలు వందనాలయ్యా..
శతకోటి స్తోత్రలయ్యా... ఆ.. ఆ.. ఆ.. [2]
యేసయ్యా... యేసయ్యా... [1]
|యేసయ్య|
1. నీ కృపచేత నన్ను రక్షించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ దయచేత శిక్షను తప్పించినందుకు
కోట్లాది స్తోత్రలయ్యా [2]
నీ జాలి నాపై కనపరిచినందుకు
వేలాది వందనాలయ్యా
నీ ప్రేమ నాపై కురిపించినందుకు
కోట్లాది స్తోత్రలయ్యా [1]
|వందనాలు|
2. జీవగ్రంధంలో నా పేరుంచినందుకు
వేలాది వందనాలయ్యా
పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు
కోట్లాది స్తోత్రలయ్యా [2]
నన్ను నరకం నుండి తప్పించినందుకు
వేలాది వందనాలయ్యా
నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు
కోట్లాది స్తోత్రలయ్యా [1]
|వందనాలు|
0 Comments