పన్నెండు గుమ్మముల పరలోక రాజ్యం తీగోమల్లెలెన్నియలో
ధగధగ మెరిసె ధన్యుల లోకము తీగోమల్లెలెన్నియల్లో జయించు వారికి జన్మస్థానమట తీగోమల్లెలెన్నియల్లో పొందగోరు వారందరు రండి తీగోమల్లెలెన్నియల్లో
పన్నెండు రకాల రాళ్ళతో కట్టిరి తీగోమల్లెలెన్నియలో మొదటి రాయి సూర్యకాంతము రెండవ రాయి నీలవర్ణము మూడవ రాయి యమున రాయి నాల్గవ రాయి పచ్చగుందట తీగోమల్లెలెన్నియల్లో
ఐదవ రాయి వైడూర్యము ఆరవ రాయి కెంపు వంటిది ఏడవ రాయి సువర్ణ రత్నము ఎనిమిదవ రాయి గోమేధికము తీగోమల్లెలెన్నియల్లో
తొమ్మిదవ రాయి పుష్యరాగము పదవ రాయి సువర్ణ శునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధమంట తీగోమల్లెలెన్నియల్లో ఏడ్పులేని ఏకైక రాజ్యము తీగోమల్లెలెన్నియల్లో
దుఃఖము లేని గొప్పలోకము కష్టము లేని కరుణ లోకము మరణము లేని మంచిలోకము స్తుతి గీతాలకు మూల కేంద్రమట తీగోమల్లెలెన్నియల్లో
పన్నెండు గుమ్మముల పరలోక రాజ్యం తమ్ముడూ నీవొస్తావా - ఏడ్పులేని ఏకైక రాజ్యము అన్నా నీవొస్తావా-మరణములేని మంచిలోకము అమ్మా నీవొస్తావా కష్టములేని కరుణలోకము చెల్లీ నీవొస్తావా దుఃఖములేని గొప్పలోకము బాబు నీవొస్తావా అయ్యా, అక్కా తాత నీ వొస్తావా
0 Comments