Naa jeevithaniki song lyrics, నా జీవితానికి ఒక అర్థమే song lyrics, p james moses dany songs, christian marriage song of james anna, desire of christ marriage song telugu lyrics

నా జీవితానికి ఒక అర్థమే ఉన్నాధని 
నా కోసమే ఒక చిత్తమే ఉన్నాధని || 2 || 
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై || 2 ||
ఇది తెలియక లోక ప్రేమనే 
అది నిజముగా నేను తలిచానే ||నా జీవితానికీ||

1. సృష్టిలోనే సౌందర్యమైన 
అదియే వివాహ బంధము 
కష్ట సమయములోన సైతం ప్రేమ పంచే బంధము || 2 ||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై 
జీవము అను కృపావరములో ఒకరికొకరుగా జీవించాలి| 2 ||                                              ||నా జీవితానికీ॥
2. పానుపే పవిత్రమైన నిష్కళంకమైనది
జారులకు వ్యభిచారులకు తీర్పు తీర్చే వాడవు. || 2 ||
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై
అది కళంకము ముడతలైనను 
మరి ఏదియు లేని ప్రేమ ఇది || 2 || ||నా జీవితానికీ॥

3. క్రీస్తు సంఘమును ప్రేమించినంతగా 
భర్త భార్య ను ప్రేమించవలెను
సంఘమూ లోబడినంతగా 
భార్య భర్త కు లోబడవలెను.|| 2
దేవా నీ ప్రేమకు ప్రతిరూపమే వివాహమై || 2 ||
ఇది తెలియక లోక ప్రేమనే అది నిజముగా నేను తలిచానే
                                             ||నా జీవితానికీ॥ 



Reactions

Post a Comment

0 Comments