కన్నీటి లోయలలో SONG
ప: కన్నీటి లోయలలో - నేనెంతో కృంగిననూ
కన్నీరు చూచువాడు - కార్యము జరిగించును (2)
నీ మనసు కదలకుండా - నీ మనసు కృంగకుండా
నీతోనే ఎల్లప్పుడూ - నేనుందున్ అంతం వరకు
(2) (కన్నీటి)
1. చీకటి బాటయైనా - భయంకర శోధన
కలువున్ ఆ వేళలో - సిలువ నీడ నీకై
(2) (నీ మనసు)
2. ఎర్ర సముద్ర తీరం - మొర్రలిడిన్ తన దాసులు
గుండెల్లో దాగి ఉన్న - గొప్ప బాధ తొలగెన్
(2) (నీ మనసు)
3. ఎంత కాలం వేచి ఉండాలి - నాథా నీ రాకడకై
శ్రమలు తీరుటకు - ఎంతో కాలం లేదు
(2) (నీ మనసు)
For more christian song lyrics to follow this blogger
0 Comments