రాలిపోయే పువ్వుకు Raalipoye puvvuku song lyrics telugu, bro seenanna songs, halleluya ministries songs, telugu christian song lyrics

రాలిపోయే పువ్వుకు ఎందుకిన్ని రంగులో
విడిచివెల్లె గూడుకు ఎందుకిన్ని హంగులో(2)
అందమెంతవున్న బంధుభలగమెంతవున్న(2) 
                                                    (రాలిపోయే)
1. అందమైన జీవితం రంగుల గాలిపటం
అందరి కన్నుల ముందు అందంగా ఆడును (2)
ఆధారమైన దారం అంటు ఉన్నంత వరకేగా (2)
తెగక మనునా తెగినంక ఆగునా(2)
అది తెగక మానునా తెగినంక ఆగునా
ఏకడో కొమ్మకు చిక్కుకొని చినుగును (2)
రంగులేమాయే పొంగులేమాయే
చెంగులేమాయే దానీ హంగులేమాయే (2) 
                                                  (రాలిపోయే)
2. మాయలో బ్రతుకులో మనషుల జీవితం
కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం(2)
క్షేమకాలమంత యేసయ్యను త్రోసివేసి(2)
వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా
ఇక వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా
దేవుని పిలచిన కాపడమని పలికిన(2)
మరణమన్నది కనికరించదు
నరకమున్నది అది జాలి చూపదు(2) 
                                            (రాలిపోయే)
3. మరణపు ముళ్ళును విరిచిన ధీరుడు
మరణము గెలిచిన సజీవుడై లేచిన
ప్రభువైన యేసుక్రీస్తు 
తను పిలచుచుండె నిన్ను (2)
పాపివైనను నీవు రోగివైనను
ఎంత పాపివైనను నీవు రోగివైనను(2)
ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు (2)
యేసే మార్గము యేసే జీవము
యేసే సత్యము యేసే నిత్య జీవము (2)
                                                 (రాలిపోయే)



Reactions

Post a Comment

0 Comments