పల్లవి:
గగణము చీల్చుకొని ఘనులను తీసుకొని
నన్ను కొనిపోవ రానైయున్న
ప్రాణ ప్రియుడా యేసయ్యా [2]
నిన్ను చూడాలని
నా హృదయమెంతో ఉల్లసించుచున్నది [2]
ఉల్లసించుచున్నది. [1]
|గగణము|
చరణం:1️⃣
నీ దయాసంకల్పమే నీ ప్రేమను పంచినది
నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది [2]
పవిత్రురాలైన కన్యకగా
నీ ఎదుట నేను నిలిచేదను [2]
నీ కౌగిలిలో నేను విశ్రమింతును [2]
|గగణము|
చరణం:2️⃣
నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది
మర్మమైయున్న నీవలే రూపించుచున్నది [2]
కళంకములేని వధువునై
నిరీక్షణతో నిన్ను చేరేధను [2]
యుగయుగాలు నీతో ఏలేదను [2]
|గగణము|
చరణం:3️⃣
నీ కృపాబాహుళ్యమే ఐశ్వర్యమునిచ్చినది
తెజోవాసుల స్వస్థ్యం అనుగ్రహించినది [2]
అక్షయమైన దేహముతో
అనాది ప్రణాళికతో [2]
సీయోనులో నీతో నేనుందును [2]
|గగణము|
నిన్ను చూడాలని నిన్ను చూడాలని
నిన్ను చేరాలని...... [4]
0 Comments