అధ్వితీయుడా.. నన్నేలు దైవమా..
వర్ణించలేను స్వామి.....
నీ గొప్ప కార్యములను.... [1]
పల్లవి:
మదిలోన నీరూపం నీ నిత్యసంకల్పం
ప్రతిఫలింపజేయునే ఎన్నడూ [2]
కలనైన తలంచలేదే నీలో ఈ సౌభాగ్యము
వర్ణించలేను స్వామి నీ గొప్ప కార్యాలను
నీసాటి లేదు ఇలలో అధ్వితీయుడా [1]
|మదిలోన|
చరణం:1️⃣
ప్రతి గెలుపు బాటలోన చైతన్య స్ఫూర్తి నీవై
నడిపించుచున్న నేర్పరి
అలుపెరుగని పోరాటాలే ఊహించని ఉప్పెనలై
నన్ను నిలువనీయని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రయేలు దైవమా
జయమిచ్చి నడిపించితివే నీ ఖ్యాతికై
తడి కన్నులనే తుడిచిన నేస్తం ఇలలో
నీవేకదా యేసయ్యా..... [1]
|మదిలోన|
చరణం:2️⃣
నిరంతరం నీ సన్నిధిలో నీ అడుగుజాడలలోనే
సంకల్ప దీక్షతో సాగెదా
నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై
ఆశయాల దిశగా నడిపేనే
నీ నిత్య ఆదరనే అన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతా తీర్చి నా సేదదిర్చితివి
నీ ఆత్మతో ముద్రించితివి
నీ కొరకు సాక్షిగా యేసయ్యా..... [1]
|మదిలోన|
చరణం:3️⃣
విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ్య నిర్మాతవు
స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్నెతవు
ఆ గడియ వరకు విడువకు
నే వేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్ఠమైన స్వస్థ్యము కోసం సిద్ధపరచుమా
నా ఊహలలో ఆశలసౌదం
ఇలలో నీవేనయ్యా యేసయ్యా...... [1]
|మదిలోన|
0 Comments