నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ song, nenellappudu yehovanu sannuthinchedan song lyrics, antha naa meluke song lyrics, christian song lyrics

      నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ Song 

ప: నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ 
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2) 
అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే (తన చిత్తమునకు తల వంచితే)-(2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) స్తుతియించుట మానను

1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన 
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన 
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) 
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)

2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన 
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను – యెహోవా తీసికొనెను - (2)  
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)

3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2) 
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు - (2)

4. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు 
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)

5. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు 
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)







Reactions

Post a Comment

0 Comments