మహాదేవుడా మహోన్నతుడా song lyrics, maha devudu song lyrics, telugu christian song

పల్లవి: మహాదేవుడా మహోన్నతుడా 
మహాఘనుడా మా పరిశుద్ధుడా 
యుగయుగములకు దేవుడవు 
తరతరములకు నీవే మా ప్రభుడవు 
స్తోత్రార్హుడా స్తుతి పాత్రుడా 
స్తుతులందుకో నా యేసయ్య 
ఆరాధన నీకే యేసయ్య 
స్తుతి అర్పణ నీకే మెస్సయ్య 
యెహోవా ఈరే యెహోవా షమ్మా 
యెహోవా షాలోమ్ యెహోవా రాఫా

1. ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపీఠం 
అడవి మృగములు ఆకాశ పక్షులు 
సముద్ర మస్థ్యములు నీ నిర్మాణములు 
మంటితో నరుని నిర్మించినావు 
నీ పోలికలో సృజించినావు 
నీ స్వాస్థ్యమునే మాకిచ్చినావు 
నీ వారసునిగా మమ్ము పిలిచినావు
                                          "యెహోవా ఈరే"
2. పరిశుద్ధుడు పరిశుద్ధుడని 
సెరాపులు నిన్ను స్తుతించగా 
సర్వోన్నతమైన స్థలములలో 
దేవునికి మహిమ ఘనత 
పరలోకమే నీ మహిమతో నిండెను 
భూజనులకు సమాధానం కల్గెను 
సైన్యములకు అధిపతియగు నీవు 
సర్వ సృష్టిలో పూజ్యుడనీవు
                                         "యెహోవా ఈరే"



Reactions

Post a Comment

0 Comments