కాచితివి యేసయ్య Song Lyrics
కాచితివి యేసయ్య నీకృపలో నడిపితివి
నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా
ఆ. ప. హల్లెలూయా స్తుతిమాహిమా..
హల్లెలూయా స్తుతిమహిమా
హల్లెలూయా స్తుతిమాహిమా యేసయ్యాకే
హల్లెలూయా స్తుతిమాహిమా..
1. గడచిన దినముల అన్నిటిలో
నీ కృపనన్ను వెంటాడేనే..
నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే..(2)
ఏ రోజైన ఏ క్షణమైనా..( 2 )
విడచిపోలేదయ్యా - నన్ను మరచిపోలేదయ్యా..( 2 ) విడచిపోలేదయ్యా -నన్నుమరచిపోలేదయ్యా ( 2 )
2. నా శ్రమలో నా రోదనలో
నీ వాక్యమే ధ్వనియించగా..
హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే
వాగ్ధనపు ప్రతి ధ్వనిలో (2)
నీ హస్తములో నా శ్రమలన్ని..(2)
నాట్యముగా మారేనే ఇక నాట్యము చేసెదనే ( 2 )
నాట్యముగా మారే - ఇక నాట్యము చేసెదను ( 2 )
3. నా ఒంటరి స్థితులన్నిటిలో
కాపరివై నిలిచి..
భయపడుచున్నావెందుకని
నా ముందర నడచితివే (2)
నీ నడిపింపూ... నా జయగీతం..
నా సైన్యము నీవేగా - నన్ను గెలిపించుటలోనా ( 2 )
నా సైన్యము నీవే - నన్ను గెలిపించుటలోనా (2 )
0 Comments