నీ సేవలోనే నా తుది శ్వాసను
విడవాలని యేసయ్యా
నీకై బ్రతకాలని ఆశయ్యా (2)
నీవే నా ఆశాయ్యా - నీవే నా శ్వాసయ్యా
నీవే నా సర్వము యేసయ్యా
నీవే నా ప్రాణము యేసయ్యా
1. అగ్ని గుండమే ఎదురైనా
సింహాల బోనులు నన్నడ్డగించిన (2)
నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది నాకెంతో మేలని (2)
షడ్రక్ మేషేక్ వలె అభేద్నేగొ వలె
దానియేలువలె యేసయ్యా
//నీకై బ్రతకాలని॥నీ సేవలోనే
2. ఎండ మావులు ఎదురైనా
ఆశ నిరాశ లు ఎన్నో కలిగిన (2)
ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు
వలచిన బ్రతుకులను నీలోకి మలచావు (2)
మగ్దలేన వలే - సమరయస్త్రీ వలే
సారేపతుస్త్రీ వలే యేసయ్యా
//నీకై బ్రతకాలని॥నీ సేవలోనే
0 Comments