నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా
ప: నా మనసులో నా తనువులో నీవే ఉన్నావుగా
నా కనులలో కన్నీళ్ళలో నాతో నడిచావుగా
హల్లేలూయా అని పాడనా యేసయ్య నిను కీర్తించనా
1. పరిశుద్ధతనే కోరుకున్న దేవుడవు
పరిపూర్ణతలో మము నడిపించే తండ్రివి
నీవంటి మహాదేవుడెవరూ లేరు
యుగయుగములలో నీవే రాజువు
|| నా మనసులో||
2. పిల్లలనేమి పెద్దలనేమి
నీయందు భయభక్తులు ఉన్నవారిని
ఆశీర్వదించే దేవుడవు నీవే
కృప వెంబడి కృపలో మమ్ము దీవించుము దేవా
||నా మనసులో॥
0 Comments