ఏది ఏమైనగానీ...Song Lyrics
ప: ఏది ఏమైనగానీ...నీతోనే ఉంటానయ్యా
నను ఎవ్వరేమన్నగానీ
నిను విడిచి పోలేనయ్యా || 2 ||
నాప్రాణమా..నాసర్వమా..... || 2 ||
నాకున్నది నీవేనయ్యా..... || 2 ||
|| ఏదిఏమైన ||
1. నీవు లేని భవనములు వద్దయ్యా
నీతో ఉన్న గుడారమే చాలయ్యా
నీవుంటే బ్రతుకంతా
ఆనందమే యేసయ్యా || 2 ||
నీవులేనిదే నాకేది వలదయ్యా
నిను విడిచి వెళ్లలేనయ్యా || 2 ||
|| ఏదిఏమైన ||
2. లోకాశలు నన్ను పిలిచినా
లోకపుశ్రమలు అడ్డుగా నిలిచినా || 2 ||
నాగటిపై చెయ్యి వేసి
వెనుదిరిగి చూడలేనయ్యా. || 2 ||
నా గమ్యము నీవేనని || 2 ||
సహనముతో సాగెదనయ్యా || 2 ||
|| ఏదిఏమైన ||
3. నీవులేని ఘనతలు నాకోద్దయ్యా
నీ పాద సన్నిధే నాకు చాలయ్యా || 2 ||
నిను విడిచి యెక్కడికి
వెళ్ళగలను నేను యేసయ్యా || 2 ||
నా ఘనతంతయూ నీవేకదా || 2 ||
నీతోనే ఉంటానయ్యా || 2 ||
|| ఏదిఏమైన ||
0 Comments