కరుణా సాగర యేసయ్యా Song
కరుణా సాగర యేసయ్యా
కనుపాపగా నను కాచితివి
ఉన్నతమైనా ప్రేమతో
మనసున మహిమగ నిలిచితివి "2"
1. మరణపు లోయలో దిగులు చెందగ
అభయము నొందితి నిను చూచి "2"
దాహము తీర్చిన జీవనది
జీవ మార్గము చూపితివి "2"
" కరుణా సాగర "
2. యోగ్యత లేని పాత్రను నేను
శాశ్వత ప్రేమతో నింపితివి "2"
ఒదిగితిని నీ కౌగిలిలో
ఓదార్చితివి వాక్యముతో "2"
" కరుణా సాగర "
3. అక్షయ శాశ్వతము నే పొందుటకు
సర్వసత్యములో నడిపితివి "2"
సంపూర్ణపరచి జ్యేష్టులతో
ప్రేమ నగరిలో చేర్చుమయ్యా "2"
" కరుణా సాగర "
0 Comments