పేతురు వలె నేను song
ఆరాధ్యుడవు నీవే ప్రభు
ఆనందముతో ఆరాధింతును"2"
అత్యున్నత ప్రేమను కనపరచినావు
నిత్యము నిను కొనియాడి కీర్తింతును "2"
1. పేతురు వలె నేను ప్రభునకు దూరముగా
పనులతో జనులతో జతబడి పరుగెత్తగా(2)
ప్రయాసమే ప్రతి క్షణం ప్రతి నిమిషం పరాజయం
గలీలయ తీరమున నను గమనించితివా(2)
||ఆరాధ్యుడవు ||
2. ప్రభు రాకడనెరిగి జలజీవరాసులు
తీరము చేరిరి కర్తను తేరి చూడగా (2)
పరుగెత్తేను పలు చేపలు ప్రభు పనికై
సమకూడి సంతోషముతో ఒడ్డున గంతులేసిరి (2)
||ఆరాధ్యుడవు ||
3. నిన్నెరుగను అని పలికి అన్యునిగా జీవించితి
మీనముతో భోజనము సమకూర్చితివ(2)
ఆ చేపల సమర్పణ నేర్చితి నిను వెంబడింతు
అధ్వితీయ దేవుడవు నీవే ప్రభు(2)
||ఆరాధ్యుడవు ||
0 Comments