😲భయము ఆత్మీయుని పిరికివానిగా చేస్తుంది.👇
ఒక చిన్నది చలిమంట దగ్గర కూర్చున్న పేతురును చూచి- నీవును యేసు శిష్యులలో ఒక్కడివి కదా..! అని అడగగా పేతురు భయపడి- ఓయీ..! నీవు ఏం అంటున్నావో నాకు తెలియదు అని అబద్దం చెప్పెను. భయం ఒక ఆత్మీయుని పిరికివానిగా చేసింది అనడానికి ఇంతకంటే ఇంకేముంటుంది. భయం ఒక ఆత్మీయుని ప్రభువు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది. ఆనాడు పేతురు కలిగి ఉన్న భయమే, యేసు ఎవరో నాకు తెలియదని అబద్ధం చెప్పేవిధముగాను, ప్రమాణాలు చేసేవిధముగాను, శాపనార్థాలు పెట్టుకునే విధముగాను చేసింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన తరువాత శిష్యులు యూదులకు భయపడి తలుపులు బిగించుకొని లోపల దాక్కున్నట్టుగా మనము చూస్తాము. ఆనాడు శిష్యులు కలిగి ఉన్న భయమే ప్రభువు కోసం సాక్షిగా నిలబడకుండా చేసింది ప్రియ సహోదరీ... సహోదరుడా.! ఈ రోజు నీవు ప్రభువు కోసం జీవించవలసినంతగా జీవించలేకపోతున్నావా? దేవునికి దూరంగా జీవిస్తున్నావా? అన్యజనుల మధ్య నిన్ను నీవు ప్రభువుకు సాక్షిగా కనపరచుకోలేకపోతున్నావా ఎవరైనా నిన్ను చూచి- నీవు క్రైస్తవుడివా? అని ప్రశ్నిస్తే.. *అబ్బే.. అదేం లేదండి...* అని నీ విశ్వాసాన్ని దాచి పెట్టేవానిగా ఉన్నావా? వీటన్నిటికి కారణం, బహుశా..! నీవు కలిగి ఉన్న భయమేనేమో గమనించు.. భయము ఆత్మీయ లక్షణము కాదు. దేవుడు మనకు ఇంద్రియనిగ్రహము గల ఆత్మను ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మన జీవితాలలో అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చెయ్యలేకపోవడానికి గల కారణము మనము ధైర్యముగా ఉండవలసిన సమయములో భయపడడం వలనే. ఈ రోజు నీవు భయాన్ని విడిచిపెట్టి ధైర్యముగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ధైర్యం కలిగిన వ్యక్తి ప్రభువు కోసం ఏదైనా చెయ్యగలడు. భయాన్ని జయించి, ధైర్యముగా, ప్రభువుకు సాక్షిగా జీవించగలవారు ఎవరు? దీనికి సమాధానం బైబిలులోనే ఉంది. *నీతిమంతుడు🦁సింహమువలె ధైర్యముగా ఉండును.* నీతికరమైన యథార్థమైన జీవితమే ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తి బహిరంగముగా క్రీస్తుకు సాక్షిగా కనపరచుకోలేకపోతున్నట్లెతే దానికి గలకారణము అతని *హృదయములో యదార్ధత* లేకపోవడమే. యధార్ధముగా తాను ఏమై ఉన్నాడో అది బహిరంగముగా చెప్పుకోలేని స్థితి తాను కలిగి ఉన్నాడు కాబట్టే ధైర్యముగా ఉండలేకపోతున్నాడు. ఒక వ్యక్తి యధార్ధముగా, పరిశుద్ధముగా జీవించినప్పుడే అతనిలో ఉన్న పరిశుద్ధత ధైర్యాన్ని పుట్టిస్తుంది. పెంతెకోస్తు దినమున పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు. *మొదటిగా* వారిలోనున్న భయము బయటకు పారిపోయింది. దేవుడు మొదటినుంచి మనుష్యుల జీవితాలలో ఉన్న ఒక లక్షణాన్ని తొలగించాలని ఆశిస్తున్నాడు, ఆ లక్షణమే భయము. యేసుక్రీస్తు పెంతెకోస్తు దినాన శిష్యుల జీవితాలలో ఒక అద్భుతము చేసెను. ఆ అద్భుతము వారు కలిగి ఉన్న భయాన్ని తొలగించడమే.
ఏ పేతురైతే యేసుక్రీస్తు శిష్యునిగా పిలవబడడానికి భయపడి ముమ్మారు అబద్ధం చెప్పాడో అదే పేతురు.. సిలువ వేయబడే సమయములో తనను సిలువ వేస్తున్న వారిని చూచి- నా రక్షకుని ఈ విధముగానే సిలువ వేసారు. నన్నెందుకు ఈ విధముగా సిలువ వేస్తున్నారు. ఆ విధముగా సిలువ వేయబడడానికి నేను అర్హుడను కాను. మీరు నిజముగా నన్ను చంపదలిస్తే.. నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని అడిగి మరీ ఆ విధముగా సిలువ వేయించుకున్నాడు. ఒక చిన్న దాని దగ్గర యేసును అంగీకరించడానికి భయపడిన పేతురుకు అంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది
*ధ్యానించండి.. ధైర్యముగా జీవించండి*
1️⃣నీతిగా జీవిస్తే ధైర్యముగా బ్రతుకుతారు,
(సామెత 28:1)
2️⃣యేసు నీతోవుంటే ధైర్యముగా జీవిస్తావు.(అపొ.కా.4:13)
3️⃣దేవుని చేతి నీడలో వుంటే దైర్యముగా సేవచేస్తాము, (అపొ.కా. 4:29)
4️⃣పరిశుద్ధాత్మతో నిండియుంటే దైర్యముగా బోధిస్తాము.
(అపొ.కా. 4:31)*
5️⃣ఇతరులను అవమానించకుండా,
సన్మానిస్తే ధైర్యముగా సువార్త ప్రకటిస్తాము.
(అపొ.కా. 28:30-31)
6️⃣పాపం చేయకపోతే దైర్యముగా దేవుణ్ణి చేరుదుము.(1యోహాను 3:21)
7️⃣ప్రభువు నిమిత్తము దేన్నైనా కోల్పోవుటకు ధైర్యము కలిగి జీవించండి. దానికి ప్రతిఫలము పొందుదురు.
(హెబ్రీ 10:34,35)
ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు తన ఆధీనములోనికి తీసుకున్నపుడు తన శక్తితో నింపును. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ధైర్యము కలిగి జీవిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏమిటి? అనే ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు ఎవరైనా ఒక వ్యక్తి కోపంతో నింపబడినప్పుడు అతనిని మీరు చూసి ఉంటారు ఓ ప్రశ్న? ఇంతకీ.. ఆ వ్యక్తికి కోపం ఎక్కడ నుంచి వచ్చింది? కోపంతో ఊగిపోతున్న వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడ నుంచి వచ్చింది? బయటనుంచా.. లేదా లోపలనుంచా? ఆ వ్యక్తి కనపరుస్తున్న కోపం ఎక్కడనుంచో రాదు. అది అతనిలో నుంచే వచ్చింది. అతనిలో మౌనముగా ఉన్న కోపాన్ని, అగ్గిపుల్ల వేసి వెలిగించేసరికి అది రగులుకోవడం మొదలుపెట్టింది, అప్పుడా వ్యక్తి కోపంతో నింపబడి కోపం ఏమి చేస్తే అది చేస్తాడు. అదే విధముగా.. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నుంచో రాలేదు కానీ ఆయన ఆ వ్యక్తిలోనే ఉన్నాడు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించిన, రక్షించబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా ఇవ్వబడెను రక్షించబడిన నీలో, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన మనలోనే నివసిస్తున్నాడు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవునికి లోబడతామో ఆయన చెప్పినట్టుగా మనము చేస్తామో. ఆయన మనలో ఉండి, మనతో ఉండి..మనలో క్రీస్తు స్వరూపము వచ్చేంతవరకు తన పని చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే పేతురు మరియు మిగిలిన శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని
చేత నింపబడి, పూర్తిగా ఆయన ఆధీనములోనికి వచ్చారో అప్పుడు వారు శక్తిని పొందుకొన్నారు. ఆ శక్తి వారికి ధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యం వారిని ప్రభువు బిడ్డలుగా రోషము కలిగి జీవించే విధముగా చేసింది *ప్రియ చదువరీ* ..! నీవు ఆత్మీయ జీవితములో ధైర్యముగా ఉన్నప్పుడే.. ప్రభువు ఏమైతే నీ జీవితములో ఉద్దేశించెనో వాటిని చెయ్యగలవు. పిరికితనానికి భయానికి నీవు చోటు ఇచ్చినంతకాలం దేవుడు ఆశించినట్టుగా జీవించలేవు. నీవు భయాన్ని జయించి ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ పూర్ణునిగా ఉండాలి. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలంటే నీ హృదయములో అపవిత్రతకు పాపమునకు చోటు ఉండకూడదు. నీ హృదయములో పాపము ఉండకూడదంటే శరీర సుఖములను విడిచి దేవునికి దగ్గరగా జీవిస్తూ, ప్రార్ధన జీవితం కలిగి ఉండాలి🙌🙏
![]() |


0 Comments