ప: నజరేతు పట్నానా హో నజరెతు పట్నాన
నజరెతు పట్నానా హో నజరెతు పట్నాన [1]
హో నజరేతు పట్నాన నాగుమల్లె దారిలో
యోసేపు మరియమ్మ నాగుమల్లె దారిలో [2]
1. ప్రధానమైనది హో పెళ్లింకా కాలేదే
ప్రధానమైనది హో పెళ్లింకా కాలేదే [1]
ప్రధానమైనది నాగుమల్లె దారిలో
పెళ్లింకా కాలేదే నాగుమల్లె దారిలో [2]
దేవుని దృష్టిలో నాగుమల్లె దారిలో
నీతిమంతురాలు మరియా నాగుమల్లె దారిలో [2]
|నజరెతు|
2. దేవాలోకం నుండి దేవదూత వచ్చినాడే
హో దేవాలోకం నుండి దేవదూత వచ్చినాడే [1]
దేవాలోకం నుండి నాగుమల్లె దారిలో
దేవదూత వచ్చినాడే నాగుమల్లె దారిలో [2]
మరియా మరియా అనుచు నాగుమల్లె దారిలో
దేవదూత పిలిచే నాగుమల్లె దారిలో [2]
|నజరెతు|
3. అప్పుడు మరియమ్మ వంటింట్లో కూర్చుండె
అప్పుడు మరియమ్మ వంటింట్లో కూర్చుండె [1]
హో అప్పుడు మరియమ్మ నాగుమల్లె దారిలో
వంటింట్లో కూర్చుండె నాగుమల్లె దారిలో [2]
మరియా మరియా అనుచు నాగుమల్లె దారిలో
ఎవరయ్య పిలిచేది నాగుమల్లె దారిలో [2]
|నజరెతు|
4. నేను దేవదూతనమ్మ నను యెహోవా పంపే
నేను దేవదూతనమ్మ నను యెహోవా పంపే [1]
నేను దేవదూతనమ్మ నాగుమల్లె దారిలో
నను యెహోవా పంపే నాగుమల్లె దారిలో [2]
పరిశుద్ధ ఆత్మతో నాగుమల్లె దారిలో
కుమారున్ని కందువమ్మా నాగుమల్లె దారిలో [2]
|నజరెతు|
5. పురుషున్నీ ఎరగనయ్య నేనేట్ల కందునయ్య
పురుషున్నీ ఎరగనయ్య నేనేట్ల కందునయ్య } [1]
పురుషున్నీ ఎరగనయ్య నాగుమల్లె దారిలో
నేనేట్ల కందునయ్య నాగుమల్లె దారిలో [2]
పరిశుద్ధ ఆత్మతో నాగుమల్లె దారిలో
పరిశుద్ధుడు జన్మించును నాగుమల్లె దారిలో [2]
ఆయన పేరు నీవు నాగుమల్లె దారిలో
యేసు అని పెడుదువమ్మ నాగుమల్లె దారిలో [1]
లోకానికి రక్షకుడు నాగుమల్లె దారిలో
నరుడై జన్మించును నాగుమల్లె దారిలో [3]
0 Comments