ప: యేసు నీ త్యాగమే నా పాప శిక్షకై"2" 
ఎన్నో నిందలు అవి నా కోసమా
మలినమైన నా గతం ఇక లేదయ్యా"2"
ఎన్నో నిందలు అవి నా కోసమా
మలినమైన నా గతం ఇక లేదయ్యా"2"
నా జీవితమే నీదేనయ్యా నాకంటూ ఏముందయ్యా"2" 
1. బంధువులే బాధించి ఎడబాసినా 
నా వారే నన్నే అమ్మేసిన "2" 
స్నేహితులే చూడనట్టు వెళ్లిపోయిన 
నన్ను ఒంటరిని చేసి రాళ్లు రువ్విన"2" (నా జీవితమే)
2. బ్రతుకంతా చీకటి కమ్మేసిన
రక్కసి వేదనలే శోధించిన"2" 
రోదనలే రోగమై వేధించిన 
మరణాలు విలయాలు కబలించిన "2" (నా జీవితమే)
3. బలహీనతలో నన్ను బలపరిచిన 
పాపినైన నాకై మరణించిన"2" 
మృతమైన నన్ను మహిమగా మార్చిన 
మారని నీ ప్రేమకై బానిసైనా"2" (నా జీవితమే)
 
 
 
0 Comments