నీవే పిలవకుంటే Song Lyrics
ప౹౹ నీవే పిలవకుంటే నే నేమవుదునో
ఏమైపోదునో నేనేమౌదునో
ఏమౌదునో నే నేమైపోదునో
వందనాలు వందనాలయ్యా
వేల వేల వందనాలయ్యా
౹౹నీవే పిలవకుంటే౹౹
1. అంధకార బంధకాలలో బందీగ నేనున్నప్పుడు
ప్రేమ చూపి నావు విడిపించినావు
౹౹ వందనాలు వందనాలయ్యా ౹౹
2. అరణ్య ప్రాంత మందు వంటరిగా వున్నప్పుడు
ముందు నడచినావు మార్గం తెరచినావు
౹౹ వందనాలు వందనాలయ్యా ౹౹
3. బానిస సంకెళ్లతో బలహీనుడ నైయుండగా
బలపరచినావు చేరతీసినావు
౹౹ వందనాలు వందనాలయ్యా ౹౹
4. రోగ రుగ్మతల చేత రోధించుచున్ననన్ను
హస్తము చాపి నావు స్వస్థ పరచినావు
౹౹ వందనాలు వందనాలయ్యా ౹౹
For More song lyrics to follow 👇
Christianlyricsall.blogspot.com
Do Share for your friends, brothers and sisters
Thank you.
0 Comments