ఆధారం నీవే యేసయ్యా SONG
పల్లవి: ఆధారం నీవే యేసయ్యా
నా దాగుచోటువు నీవే నీవే '2'
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా '2'
1. సింహాల బోనులో నా బలము నీవే
అగ్నిగుండములో నా తోడు నీవే '2'
నీ పర్ణశాలలో నన్ను దాచినావు '2'
ఆశ్రయదుర్గము నీవే నీవే '2' "ఆధారం"
2. కునుకక కృపచూపు దేవుడవు నీవే
శ్రీమంతుడవు నీవే సర్వాధికారి '2'
జిగట మన్నుము మేము కుమ్మరివి నీవే '2'
అల్పా ఓమెగయు నీవే నీవే '2' "ఆధారం"
3. గొప్ప దేవుడవు యుద్ధశూరుడవు
స్వస్థపరచు సర్వ శక్తిమంతుడవు '2'
మారాను మధురము చేసిన దేవా '2'
నా జీవ ఊటవు నీవే నీవే '2' "ఆధారం"
0 Comments