గుండె చెదిరిన వారిని ఆధరించే దేవుడా SONG
గుండె చెదిరిన వారిని ఆధరించే దేవుడా
గూడు చెదరిన పక్షుల చేరదీసె నాధుడా
త్యాగశీలుడా నీకొందనాలయ్యా
నా హృదయ పాలకా స్తోత్రమేసయ్యా "2"
1.లోకమను అరణ్యయాత్ర భారమయెను
బహు దురమాయెను
నా గుండెనిండా వేదనలే నిండియుండెను నిందించుచుండెను
కన్నీరేనాకు అన్నపానమాయెను "2"
దిక్కు లేక నా బ్రతుకు దీనమాయెను
బహు ఘోరమాయెను " గుండె “
2.మనిషి మనిషి నోర్వలేని మాయాలోకము శూన్యఛాయలోకము
మాటలతో గాయపరిచే క్రూరలోకము అంధకారలోకము
ఒంటరి తనమే నాకు స్నేహమయెను "2"
దిక్కు లేక నా బ్రతుకు దీనమాయెను-బహు ఘోరమయెను“గుండె”
3.కష్టాల కడలి అలలునన్ను కమ్ముకున్నవి నను అలుముకున్నవి
కన్నీరు కెరటమై ఎదలో పొంగుచున్నది పొరలి సంద్రమైనది
శ్రమల కొలిమిలో పుటము వేయబడితిని "2"
పాణార్పణముగ నేను పోయబడితిని-సిలువసాక్షినైతిని
" గుండె"
Watch & listen:
0 Comments