జీవన మకరందం song, Jeevana makarandham song lyrics, hosanna ministries 2024 new album song, parimala thailam neeve song lyrics

     జీవన మకరందం Hosanna song 2024

పరిమళతైలం నీవే 
తరగని సంతోషం నీలో 
జీవన మకరందం నీవే 
తియ్యని సంగీతం నీవే

తరతరములలో నీవే 
నిత్యసంకల్ప సారధి నీవే 
జగములనేలే రాజా 
నా ప్రేమకు హేతువు నీవే

1. ఉరుముతున్న మెరుపులవంటి 
తరుముచున్న శోధనలో "2" 
నేనున్నా నీతో అంటూ నీవే 
నాతో నిలిచినావు 
క్షణమైనా విడువక ఔదార్యమును 
నాపై చూపినావు 
నీ మనసే అతి మధురం 
అది నా సొంతమే..     "పరిమళ"

2. చీల్చబడిన బండనుండి 
నా కొదువ తీర్చి నడిపితివి 
నిలువరమగు ఆత్మ శక్తితో 
కొరతలేని ఫలములతో 
నను నీ రాజ్యమునకు పాత్రుని 
చేయ ఏర్పరచుకొంటివి 
నీ స్వాస్థ్యములోనే చేరుటకై 
అభిషేకించినావు 
నీ మహిమార్ధం వాడబడే 
నీ పాత్రను నేను..     "పరిమళ"

3. వేచియున్న కనులకు నీవు 
కనువిందే చేస్తావని 
సిద్ధపడిన రాజుగా నీవు 
నాకోసం వస్తావని 
నిను చూచిన వేళ 
నాలో ప్రాణం ఉద్వేగభరితమై 
నీ కౌగిట ఒదిగి 
ఆనందముతో నీలో మమేకమై 
యుగయుగములలో నీతో 
నేను నిలిచిపోదును...      "పరిమళ"


Reactions

Post a Comment

0 Comments