నా మదిలోని ఆనందమా song | naa madiloni anandama song lyrics

   నా మదిలోని ఆనందమా Song 

ప: నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో  స్నేహమా
నా అనుభవాలో అనురాగమా       2
యేసయ్యా.... ఎన్నితరాలకైన
యేసయ్యా.... మాస్థితులేమైన        
మాట తప్పేవాడవు కానేకావయా
నిన్ను కలిగిన హృదయం  
పదిలం  మెస్సయ్య           2॥॥నా మది
1. నా నడకలో నీ అడుగు ఉందనీ
నా శ్వాస కేవలం నీకృపమాత్రమేననీ     2
నీవులేకుండా నా పయనం సాగదనీ...
నీస్మరణ లేని నా ఊపిరి వ్యర్ధమని      2
తెలుసుకున్నానయ్యా ఇల నువ్వే చాలయ్య 
 లోకం వద్దయ్యా 
నిన్నే వెంబడిస్తానయ్య  2॥॥నా మది

2. నాలోని ఆనందం నీదేనని
నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని  2
ఒంటరైన వేళ వెంటే ఉన్నావనీ....
నీ అనురాగమే కొండంత అండనీ....      2
సాక్షిగుంటానయ్యా నినువిడచి మనలేనయ్య 
నీవే కావాలయ్యా 
అది  జన్మకు చాలయ్య 2

ప: నా మదిలోని ఆనందమా
నా ఊహలోని ఆశ్చర్యమా
నా ఏకాంతంలో  స్నేహమా
నా అనుభవాలో అనురాగమా    
యేసయ్యా.... నే పాడుతున్న
యేసయ్యా.... నేను నమ్ముతున్న ||2||
నే కోరుకున్నది పొందుకుంటానని
నీవు ఏరోజు నన్ను దాటిపోలేదని  2॥॥నా మది

మాట తప్పవయ్యా...
నీవు లేకుండా మా రోజే గడవదయ్యా..
యేసయ్యా..ఆ..ఆ.. ధాటిపోలేదయ్యా.. 
నీవుండగా భయమేలేదయ్యా..
Reactions

Post a Comment

0 Comments