నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా neelo entha prema o yesayya song lyrics, telugu christian songs lyrics, #christianlyricsall

          నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా SONG 

ప౹౹ నీలో ఇంత ప్రేమ ఓ యేసయ్యా..

      నాపై ఎంత జాలి నా మెస్సయ్య -2

      ఎందుకో నన్నింతగా ప్రేమించావు 

      నేనేలాగు నీ రుణము తీర్చుకోనయ్య -2
                                               ౹౹నీలో ఇంత ప్రేమ౹౹

1. పాపినైన నా కొరకు పరలోకం విడిచావు 

నశియించి పోయేనన్ను వెదకి రక్షించావు -2 

యే యోగ్యత నాలో వుందని... 2

నీ పోలికలో నన్ను చేసినందుకా... -2

                                           ౹౹నీలో ఇంత ప్రేమ౹౹

2. దోషినైన నా కొరకు నీ ప్రాణం విడిచావు 

పరిశుద్ధమైన రక్తం నాకొరకే కార్చావు -2 

నీ ప్రాణమైన నా కోసం వదులుకున్నావు 

నన్నొదులుకోలేదు నా సర్వమా - 2

                                           ౹౹నీలో ఇంత ప్రేమ౹౹

3. వేవేల దూతలతో కడభూర శబ్దముతో

 సియ్యోను రారాజువై నాకొరకే వస్తావు -2

నా దీన జీవితం నీ మహిమతో నింపి 

పరిశుద్ధుల సహవాసంలో చేర్చుకొందువే -2

                                              ౹౹నీలో ఇంత ప్రేమ౹౹

FOR MORE SONGS LYRICS FOLLOW THIS BLOGGER



Reactions

Post a Comment

0 Comments